వివేకా హత్య కేసు నిందితులకు బిగుస్తున్న ఉచ్చు-ఆ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

ఏపీలో రెండేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొలిక్కి వస్తోంది. ఈ కేసులో నిందితులుగా భావిస్తూ సీబీఐ అరెస్టు చేసిన వారికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వారు హత్య ఆరోపణలను తోసిపుచ్చుతూ హైకోర్టులో పిటిషన్లు వేస్తుండగా.. వారికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

పులివెందులలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. వివేకా హత్యకు సూత్రధారులు, పాత్రధారులు తన లైఫ్ సెటిల్ చేస్తానని చెప్పడంతో వారికి సహకరించినట్లు ఇప్పటికే దస్తగిరి సీబీఐకి చెప్పాడు. ఈ నేపథ్యంలో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు వీటిని కొట్టేస్తూ ఇవాళ తీర్పు నిచ్చింది.

ap high court dismissed petitions of two accsued in ys vivekananda reddy murder case

వివేకా హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్ రెడ్డిని అనుమానిస్తున్న సీబీఐ.. తాజా ఛార్జిషీట్లలో వారి పేర్లు పెట్టిందన్న ప్రచారం ఓవైపు సంచలనం రేపుతోంది. ఈ ఛార్జిషీట్ లో వివరాలను వైసీపీ పెద్దలు నిన్న ఖండించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో ఉన్న కీలక నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. దీంతో వీరు అసలు దస్తగిరి అప్రూవర్ గా మారడం వల్లే ఇదంతా జరుగుతందని భావిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో హైకోర్టు కూడా సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. వీరి పిటిషన్లు కొట్టేయడంతో సీబీఐ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+