చంద్రబాబు కు బెయిల్ దక్కేనా - నేడే కీలకం..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ వ్యవహారంలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. స్కిల్ స్కాంలో బెయిల మంజేరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ కేసులో విచారణ చేస్తున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించింది. దీంతో, బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

హైకోర్టులో బెయిల్ పిటీషన్:చంద్రబాబు గత 34 రోజులుగా స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు క్వాష్ పిటీషన్ పైన ప్రధానంగా చంద్రబాబు న్యాయవాదులు ఫోకస్ చేసారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పైన విచారణ కొనసాగుతోంది. రేపు (శుక్రవారం) సుప్రీంలో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఈ సమయంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. ప్రధాన వ్యాజ్యంపైన విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేశ్ రెడ్డి ఈ పిటీషన్ పై విచారణ జరపనున్నారు. ఇదే కేసులో సీఐడీ కసట్డీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసిన అంశాన్ని పిటీషన్ లో పేర్కొన్నారు.

AP High court likely to conduct trail on Chandra Babu Bail petition in skill scam today

నేడు బెయిల్ పై విచారణ:స్కిల్ కేసులో ఇప్పటికే దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలను సేకరించదని వివరించారు. తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటషన్ కొట్టివేసిందని హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రజా జీవితం లో ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చంద్రబాబు తన బెయిల్ అభ్యర్దన పిటీషన్ లో వివరించారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటీషన్ పైన సీఐడీ తరపు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ లో హైకోర్టు సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.

AP High court likely to conduct trail on Chandra Babu Bail petition in skill scam today

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:ఇక, ఇప్పుడు హైకోర్టులో స్కిల్ కేసులో బెయిల్ విచారణకు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన మూడ విడతులుగా సుదీర్ఘ విచారణ సాగింది. 17ఏ కేంద్రంగా ప్రధానంగా ఈ వాదనలు సాగాయి. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసారని..స్కిల్ కేసులో రిమాండ్ రిపోర్టు కొట్టి వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇంకా వాదనలు జరగాల్సి ఉంది. దీంతో, రేపటికి ఈ కేసును వాయిదా వేసారు. విచారణ తరువాత సుప్రీం క్వాష్ పిటీషన్ పైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే హైకోర్టులో బెయిల్ పిటీషన్ పైన విచారణకు వస్తుండటంతో.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా..రాదా అనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+