చంద్రబాబుు ముందస్తు బెయిల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి ఇప్పటికే స్కిల్ కేసులో రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ పై సీఐడీ సుప్రీంకు అప్పీల్ వెళ్లింది. ఈ కేసు విచారణను సుప్రీం వచ్చ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఇక, ఇటు సీఐడీ నమోదు చేసిన ఇతర కేసుల్లో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసారు. దీని పైన విచారించిన హై కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్‌ను సీఐడీ అధికారులు దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని అడిషనల్ అఫిడవిట్‌లో సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దాఖలు చేసిన పిటిషన్లపై నేడు తన వాదనలను సీఐడీ అధికారులు కోరారు. దీంతో, ఈ కేసు విచారణను డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇప్పటికే స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీని పైన సీఐడీ సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లగా..కేసు విచారణలో ఉంది. తాజాగా సుప్రీం ఈ కేసుకు సంబంధించి ఎక్కడా ప్రస్తావన చేయవద్దని ఇరు పక్షాలకు స్పష్టం చేసింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంనేందుకు వీలుగా చంద్రబాబుకు అనుమతి ఇచ్చింది. దీంతో, ఈ నెల 30న చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. స్కిల్ కేసులో తీర్పు తరువాత ఈ కేసు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు చంద్రబాబు కేసులన్నీ 17ఏ తీర్పు పైన ఆధారపడి ఉన్నాయి. సుప్రీం లో క్వాష్ తీర్పు అనుకూలంగా వస్తే చంద్రబాబుకు భారీ ఊరట దక్కనుంది. దీంతో, సుప్రీం తీర్పు కోసం వేచి చూస్తున్నారు.
ఇదే సమయంలో అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటీషన్ల పైన విచారణను హైకోర్టు వాయిదా వేసింది.స్కిల్ స్కామ్‌లో లోతైన విచారణకు సీఐడీని ఆదేశించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ విచారణకు వచ్చింది. ప్రతివాదులకు నోటీసులు అందలేదనే అంశం కోర్టు ముందుకు వచ్చింది. దీంతో, ఈ కేసు విచారణ కోసం న్యాయస్థానం వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications