ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో వైరల్.. పెద్ద చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా వార్తల్లో ముఖ్యమైన విషయంగానే మారుతుంది. ముఖ్యంగా టిడిపి కూటమి ప్రభుత్వంలోని మంత్రులు ఏం చేసినా దానిపైన ప్రధాన చర్చ జరుగుతుంది. తాజాగా ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక వీడియో పోస్ట్ వైరల్ గా మారింది. అసలు ఇంతకీ వంగలపూడి అనిత చేసిన పోస్ట్ ఏమిటి? ఆ వీడియోలో ఏముంది? అన్న వివరాలలోకి వెళితే..

వంగలపూడి అనిత ఆసక్తికర పోస్ట్
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఆ పోస్టులో విజిబుల్ పోలీసింగ్, ఇన్ విజిబుల్ పోలీసింగ్ అన్న దానికి చెబుతున్న ఘటన ఇది అంటూ పేర్కొన్నారు. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాట ఆడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించి అరెస్టు చేశారని అన్నారు.

AP Home Minister Vangalapudi Anitha video goes viral big discussion

వారికి అభినందనలు అంటూ అనిత పోస్ట్
టెక్నాలజీ సహాయంతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు అంటూ డ్రోన్ టెక్నాలజీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను ట్యాగ్ చేస్తూ వంగలపూడి అనిత ఆసక్తికర పోస్ట్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ మారుమూల ప్రాంతంలో, పనిలేని లారీలను పార్టీ చేసి పోలీసుల కళ్ళుకప్పి పేకాట ఆడేందుకు పేకాట రాయుళ్ళు చేసిన పనిని డ్రోన్ కెమెరా సహాయంతో పోలీసులు గుర్తించారు.

డ్రోన్ టెక్నాలజీతో పోలీసులు చేసిందిదే

ఇక డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పేకాట స్థావరాన్ని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి వారందరినీ అరెస్ట్ చేశారు. అంతకుముందు డ్రోన్ కెమెరాలు పొలాలలో, నిర్జన ప్రదేశాలలోనూ ఉన్న మందు బాబులకు చెమటలు పట్టిస్తే ప్రస్తుతం పేకాటరాయుళ్లను డ్రోన్ కెమెరాలు అడ్డంగా బుక్ చేశాయి. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత షేర్ చేసిన ఈ వీడియోని చూసిన ఏపీ ప్రజలు పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు.

https://twitter.com/Anitha_TDP/status/1904856548855472615

హోం శాఖామంత్రికి అభినందనలు
వంగలపూడి అనిత షేర్ చేసిన పోస్ట్ తో హోం శాఖామంత్రిని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యాకలాపాలకు చెక్ పెట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా హోం మంత్రికి గుర్తు చేస్తున్నారు. ఇక అనిత పోస్ట్ తో తమ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏం చేస్తుందో అందరికీ అర్ధం అయ్యేలా చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+