boycott swiggy: ఏపీలో స్విగ్గీ బాయ్ కాట్-హోటల్స్ నిర్ణయం..! కారణమిదే..

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోటళ్ల అసోసియేషన్ పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్దితుల్లో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి హోటల్స్ కూ, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్ కూ మధ్య కొంతకాలంగా విభేధాలు కొనసాగుతోంది. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, ఎక్కువ కమిషన్ డిమాండ్ చేయడం వంటి కారణాలతో స్విగ్గీతో పాటు జొమాటోపైనా హోటళ్లు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ సత్తా చూపించాలని వారు నిర్ణయించారు. రాష్టంలో హోటల్స్ ఆధారంగా వ్యాపారాలు చేసుకుంటూ తమనే ఇబ్బంది పెడతారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ap hoteliers to boycott food delivery app swiggy from oct 14- here is reason

ఈ నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు స్విగ్గీకి ఈ మేరకు అక్టోబర్ 14 వరకూ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఆ లోపు చర్చలు జరిపి దారికి వస్తే సరేసరి లేకుంటే స్విగ్గీని బహిష్కరించడం ఖాయమని హోటళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే స్విగ్గీ మాత్రం తమ షరతుల్ని సడలించేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో చర్చలు జరగబోతున్నాయి. అవి విఫలమైతే మాత్రం అక్టోబర్ 14 నుంచి స్విగ్గీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+