ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు- రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ వీరికే...!!

ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను అధికారికంగా ప్రకటించింది. అదే విధంగా వచ్చిన మార్కులపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులకు లేదా కొద్ది మార్కులతో ఫెయిల్ అయిన వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. ఫీజులు.. పరీక్షల తేదీలను వెల్లడించింది.

ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై... జూన్ 11 వరకు ఉంటాయి. ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారికి ఇంటర్ ప్రాక్టిలక్‌ పరీక్షలు జూన్‌ 7, 2026వ తేదీ నుంచి జూన్‌ 11, 2026వ తేదీ వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులు ఎవరైనా ప్రాక్టికల్స్, సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాయాలంటే తొలుత సాధించిన మార్కులను రద్దు చేసుకోవల్సి ఉంటుంది.

ఇంటర్ పాస్ విద్యార్థులకు 1 లక్ష వరకు స్కాలర్‌షిప్- అర్హతలు, దరఖాస్తులు..!!
ఇంటర్ పాస్ విద్యార్థులకు 1 లక్ష వరకు స్కాలర్‌షిప్- అర్హతలు, దరఖాస్తులు..!!
ap-intermediate-board-announces-the-dates-for-inter-supplementary-examination-here-the-schedule

ఇంటర్మీడీయట్ బోర్దు వివరాల వెల్లడి

కాగా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఇంప్రూవ్‌ మెంట్, రీ వెరిఫికేషన్‌ కోసం ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20, 2026వ తేదీ న ఉంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. విద్యార్దులు ఈ వారం రోజుల వ్యవధిలో ఫీజులు చెల్లించాలి. మార్కుల లెక్కింపులో పొరపాట్లు ఉన్నాయని భావిస్తే రీకౌంటింగ్ కు, సమాధాన పత్రాలను మళ్లీ సరిచూడాలని అనుకుంటే రీవెరిఫికేషన్ కు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏమాత్రం కుంగిపోకుండా, ఈ సప్లిమెంటరీ పరీక్షలను అవకాశంగా తీసుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఫలితాల్లో విద్యార్ధులకు ఎవరైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+