AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!
AP Intermediate Results 2026: ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల ముహూర్తం ఖరారు చేసారు. ఈ రోజు (ఆదివారం) తెలంగాణ ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఏపీలో ఫలితాల వెల్లడి పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. కాగా, అధికారికంగా ఫలితాల పైన అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం తుది కసరత్తు జరుగుతోంది. ఈ సంవత్సరం త్వరగా ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. ఇక.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల ఫలితాల పైన నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్ అప్డేట్. ఏపీ ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు తుది కసరత్తు చేస్తోంది. మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా..ఫలితాల విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమైన పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు జరిగాయి. ఈ ఏడాది ప్రధమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో, మూల్యాంకనం పూర్తి చేయటం కొంత ఆలస్యమైంది. ఇక మూల్యాంకనం పూర్తి చేయటంతో.. ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. 18వ తేదీన విడుదలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణలో నేడు ఫలితాల ప్రకటన
ఇక, తెలంగాణలో ఈ రోజు ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. ఇప్పుడు ఫలితాలను కూడా ఇదే రకంగా వాట్సప్ ద్వారా అందిస్తున్నారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసి 'Hi' అని మెసేజ్ పంపాలి. అనంతరం మెనూలో "BIE Exam Result" ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ సంవత్సరం/2వ సంవత్సరం), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన వెంటనే ఫలితాలు మెసేజ్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.












Click it and Unblock the Notifications