జగన్ సర్కార్ కు ఉద్యోగుల వార్నింగ్- నెలాఖరులోగా పీఆర్సీ ఇవ్వకపోతే తాడోపేడో
ఏపీలో వైసీపీ సర్కార్ కు ఉద్యోగులు ఇవాళ మరో వార్నింగ్ ఇచ్చారు. పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి మానుకోవాలని, ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే తాడోపేడో తేల్చుకుంటామన్నారు. ఈ మేరకు గుంటూరులో జరిగిన పెన్షనర్ల భేటీలో ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ఈ హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకూ ఒక్కటికూడా అమలు కాలేదు. పీఆర్సీ అమలు, డీఏ పెంపు, సీపీఎస్ విధానం రద్దు.. ఇలా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఉద్యోగులు సీరియస్ కావడంతో పీఆర్సీ అమలు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. అయితే పీఆర్సీ నివేదిక కూడా వెలువడలేదు. ఉద్యోగులు పలుమార్లు సీఎస్ ను కిలిసి నివేదిక కోరినా అది మాత్రం బయటికి రాలేదు. దీంతో ఆ తర్వాత జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బాయ్ కాట్ చేసి బయటికి వచ్చారు.

ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగులు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు ఇవాళ మరోసారి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెలాఖరు లోపు పీఆర్సీ వ్యవహారం తేల్చకపోతే ఈ నెల 27, 28 తేదీల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఆస్పత్రికి వెళ్లాలంటే హెల్త్ కార్డులు లేవని, ఆస్పత్రుల్లో బిల్లులు కోట్లలో పెండింగ్ లో ఉన్నాయని, రెండేళ్లుగా ఏ ఒక్కటీ అమలుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెలలోనే పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేవన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ జోక్యంచేసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. పీఆర్సీపై ఇక ఓపిక పట్టే పరిస్ధితి లేదని, నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే తాడోపేడో తేల్చుకుంటామని బండి శ్రీనివాసరావు హెచ్చరించారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications