Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళా ఐఏఎస్‌లకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ వేధింపులు.. ఉన్నతాధికారులే టార్గెట్‌గా అశ్లీల పోస్టులతో

అతడు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. ఇంటర్మీడియట్‌లో స్టేట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఉన్నత చదువులను మంచి మార్కులతో పూర్తి చేశాడు. ఇక ఉన్నత లక్ష్యంగా సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాడు. రెండుసార్లు సివిల్స్ రాసిన అతడు రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే, ఇంటర్వ్యూలో అతడు విఫలమయ్యాడు.

వారే లక్ష్యంగా.. అసభ్య, అశ్లీల పోస్టులు

వారే లక్ష్యంగా.. అసభ్య, అశ్లీల పోస్టులు

ఇక నాటి నుంచి అతడు ఓ మానిసక రోగిలా మారిపోయాడు. మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. అంతటితో ఆగకుండా వాటిలో అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. దీంతోపలువురు అధికారిణిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చివరకు అతడు కటకటాలపాలయ్యాడు. అతడే కృష్ణా జిల్లా పెదఓగిరాలకు చెందిన కూనపరెడ్డి మన్మోహన్.

ఐఏఎస్ కావాలనుకున్నాడు.. కానీ..

ఐఏఎస్ కావాలనుకున్నాడు.. కానీ..

మన్మోహన్ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇంటర్మీడియట్‌లో స్టేట్ ర్యాంక్ సాధించిన మన్మోహన్.. విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. సివిల్స్ లక్ష్యంగా ఐదేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే, ఇంటర్వ్యూలో నెగ్గుకురాలేకపోయాడు. ఈ క్రమంలో అతడు నిరాశనిస్పృహకు లోనయ్యాడు. ఓ మానిసక రోగిలా మారిపోయి.

ఏపీ, తెలంగాణే కాదు..

ఏపీ, తెలంగాణే కాదు..

ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారులను లక్ష్యం చేసుకుని వేధింపులకు దిగాడు. అతడు వేధింపులకు గురిచేసిన అధికారిణుల జాబితా పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులనేగాక కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న 54 మంది మహిళా అధికారులను వేధింపులకు గురిచేశాడు.

మహిళా అధికారుణిల పేరిట అసభ్య పోస్టులు..

మహిళా అధికారుణిల పేరిట అసభ్య పోస్టులు..

‘మీరు సాయంత్రాలు ఖాళీగా ఉంటున్నారా? అందమైన సాయంత్రాన్ని మరింత అందంగా గడుపుదామా? ప్రేమ అంటే మనసుకు నచ్చిన వారికి పంచడమే.. సరసమైనా.. విరసమైనా సరే.. సమఉజ్జీలుండాలి.. మరి మీరు తయారా?' అంటూ ఫేస్‌బుక్ ఖాతాల్లో మహిళా అధికారిణుల పేరిట పోస్టులు పెట్టేవాడు మన్మోహన్.

సిటీకి చెందిన అధికారిణి ఫిర్యాదుతో..

సిటీకి చెందిన అధికారిణి ఫిర్యాదుతో..

కాగా, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారిణి తన పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించి.. ఆ సంస్థ ప్రతినిధులకు ఫిర్యాదు చేసి తొలగించారు. అయితే, ఆ తర్వాత మన్మోహన్.. ఆమె పేరిట మరో నాలుగు ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించాడు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కూనపురెడ్డి మన్మోహన్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఇంకా ఏమేం చేశాడో..

ఇంకా ఏమేం చేశాడో..

మన్మోహన్ సృష్టించిన నకిలీ ఖాతాలన్నింటినీ తొలగించారు. మన్మోహన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటామని అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ తెలిపారు. ఫేస్‌బుక్ ప్రతినిధులు కూడా ఇలాంటి ఫేక్‌ఖాతాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, వెంటనే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, తొలగించాలని సూచించారు.

పవన్ కళ్యాణ్ అభిమాని కూడా..

కాగా, మన్మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో బార్న్ టు ఐఏఎస్(ఐఏఎస్ అవ్వడం కోసమే పుట్టాను) అని రాసుకున్నాడు. అంతేగాక, ప్రముఖ సినీటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇతడు వీరాభిమాని అని తెలుస్తోంది. అతని ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్‌కు గత ఏడాది జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపాడు. దాంతోపాటు కవిత కూడా రాశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+