APలో త్వరలోనే అద్భుతం జరగబోతోంది: మంత్రి వీడియో వైరల్
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అందరిలో ఓ సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆయన ఫేస్ బుక్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. రాష్ట్రంలో కొద్దిరోజుల్లో ఒక అద్భుతం జరగబోతోందని అందులో పేర్కొన్నారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే వివరాలు తెలుసుకునేందుకు వేచిచూడాలన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి అద్భుతమైన కార్యక్రమం జరగబోతోందన్నారు. సూక్ష్మ స్థాయికి చేరువయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని, మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
మంత్రి చెప్పి విషయం ఇప్పుడు రాష్ట్రంలో సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది.ఈ వీడియోపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభంకానున్న జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం గురించి చెప్పబోతున్నారని కొందరు అంటున్నారు. లేదంటే మరో సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏదైనా కీలక ప్రకటన చేస్తారనే చర్చ జరుగుతోంది.

సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం భారీ కార్యక్రమం నిర్వహించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు మరింత విస్త్రతంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం జరగబోతోందన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని సజ్జల తెలిపారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తుంటారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్నింటినీ నెరవేర్చామన్నారు.












Click it and Unblock the Notifications