Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ: మంత్రి లోకేష్ ట్వీట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఏపీ మంత్రి నారాలోకేష్... ఇప్పుడు తను చేసిన ట్వీట్ ద్వారా మరోసారి నెటిజెన్ల నోళ్లలో ఆయన పేరు నానుతోంది. ట్విటర్ వేదికగా లోకేష్ ఏ ట్వీట్ చేసినా... అది పొలిటికల్ ట్వీట్ అయి ఉంటుంది. కానీ ఈ సారి చాలా ఇంట్రెస్టింగ్‌గా ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. అదే తన జీవిత భాగస్వామి బ్రాహ్మణితో కలిసి ఉన్న ఫోటో ట్వీట్ చేశారు.

సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణితో వివాహం జరిగింది.తమ వివాహమై 11 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మంత్రి లోకేష్ ట్విటర్ వేదికగా షేర్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది.గత 11 ఏళ్లుగా ప్రేమ, ఆప్యాయతలు నిరంతరాయంగా అందుతున్నాయని పేర్కొన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం బ్రహ్మణి అని లోకేశ్ తెలిపారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. హ్యాపీ యానివర్సరీ అంటూ బ్రహ్మణికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, లోకేశ్-బ్రహ్మణి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

AP minister Lokesh tweets a photo,goes viral on social media

లోకేష్ తన వివాహ సమయానికి ఇంకా తెలుగుదేశం పార్టీలో ఇంకా యాక్టివ్‌గా లేరు. వివాహం తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమయ్యారు.ముందుగా తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఐటీశాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి చంద్రబాబుకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన భార్య బ్రాహ్మణి మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. వీరిద్దరికి దేవాన్ష్ అనే కొడుకు ఉన్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దేవాన్ష్‌ పేరును నెటిజెన్లు ఎక్కువగా ఇంటర్నెట్ పై సెర్చ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+