అందుకే ఓడిపోయారయ్యా... కేటీఆర్ కు ఏపీ మంత్రి ఘాటు కౌంటర్..!

ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందని, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి నేతలు ఎలా ఓడిపోయారో అంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఘాటుగా స్పందించారు. కేతిరెడ్డిపై ధర్మవరంలో గెలిచిన సత్యకుమార్ కేటీఆర్ కామెంట్స్ కు ఇవాళ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు.

నాలుగేళ్ల క్రితం కేటీఆర్ తెలంగాణ మంత్రిగా ఉండగా.. ట్విట్టర్ లో ఆయనను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టిన బీజేపీ నేత సత్యకుమార్ ను ఆయన అప్పట్లో బ్లాక్ చేశారు. ఇప్పుడు ధర్మవరంలో సత్యకుమార్ చేతిలో ఓడిపోయిన కేతిరెడ్డిపై సానుభూతి వ్యక్తం చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లో తిరిగిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎలా ఓడిపోయారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ ఎక్స్ లో సత్యకుమార్ పోస్టు పెట్టారు.

ap minister satya kumar strong counter to brs leader ktr over sympathy on ysrcp mla defeat

కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ చిలుక పలుకులు పలుకుతున్నారంటూ సత్యకుమార్ మండిపడ్డారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన మాఫియా తరహాలోనే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూబకాసుర మిత్రుడు ప్రభుత్వ, ప్రైవేటు అసైన్డ్ భూములు ఆక్రమించారని గుర్తుచేశారు. చివరికి చెరువులు, కొండలు కూడా కబళించారన్నారు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే అని సత్యకుమార్ తెలిపారు.

ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారని సత్యకుమార్ తెలిపారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సం క్రితం తనను బ్లాక్ చేశారన్నారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయన్నారు. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు 'సర్టిఫికేట్' లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోవాలని కేటీఆర్ కు సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+