టీడీపీ, రఘురామపై మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు-ఊరకుక్క-పిత్తబరిగ వ్యాఖ్యలపై హర్ట్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే పట్టాభి వ్యాఖ్యలతో రాజుకున్న చిచ్చు ఇరు పార్టీల మధ్య దూషణలు, బూతుల పర్వానికి తెరదీస్తుండగా.. తాజాగా ఇవాళ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఈ వివాదంలో దూరారు. ఇవాళ అప్పలరాజు టీడీపీ, రఘురామరాజును ఉద్దేశించి పరుష పదజాలంతో రెచ్చిపోయారు.
జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి ఢిల్లీలో కూర్చున్న ఊరకుక్క రఘురామ కృష్ణంరాజు అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. బోసడికే అంటే తిట్టుకాదు..బాగున్నావా అని అర్ధం అని వాడు చెప్తాడని అప్పలరాజు అన్నారు. మీకు అంత నచ్చితే ఫ్లెక్సీలు కట్టుకోండని సలహా ఇచ్చారు. చంద్రబాబు దీక్షలో బోసుడికే చంద్రబాబు, బోసుడికే లోకేష్ అని ఫ్లెక్సీలు కట్టుకోండని కూడా మంత్రి సూచించారు. నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమం అందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అప్పలరాజు ఆరోపించారు.అందుకే శాంతిభద్రతలకు విఘాతం కలిగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు.

రాష్ట్రంలో జరిగే చర్యకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. మీరు ఒకటి కొడితే మేము వంద కొడతాము అని చంద్రబాబును హెచ్చరించారు. చంద్రబాబు దీక్ష పేరుతో కొత్త డ్రామా చేస్తున్నాడని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబుకు నీతి, సిగ్గు ఉంటే జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి చేత క్షమాపణ చెప్పించాలన్నారు. చంద్రబాబు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తెలుగుదేశం జాతీయ నాయకులు మొదలు గల్లీ నాయకులు వరకు ఎవరినీ తిరగనివ్వబోమని అప్పలరాజు హెచ్చరించారు.
Recommended Video
తనను పశువుల మంత్రి అని, పశువు అని అంటున్నారని, ఆవును తాను పశువునే..కానీ దేశీ పశువును.. మరి నీది ఏ జాతి అని అప్పలరాజు ప్రశ్నించారు. ఇంకొకడు మాట్లాడుతూ పిత్తబరిక నా కొడుకులు అంటున్నాడని, పిత్తబరిక పట్టుకునే వాళ్ళు నీకు అంత చులకనగా కనిపిస్తున్నారా అని మంత్రి నిలదీశారు. ఆ పట్టాభి గాడు జైలు నుంచి బయటకు వచ్చాక వాడి డొక్క పగలగొట్టేది మత్స్యకారులే అని హెచ్చరిస్తున్నా అని అప్పలరాజు తెలిపారు. మొన్న కాకినాడలో పిత్తబరిక పట్టుకునే వారి ధాటికి పాంట్ లో ఉచ్చపోసుకుంటూ పార్టీ ఆఫీసులో దాక్కున్నావంటూ అప్పలరాజు పట్టాభికి గుర్తు చేశారు. లేకుంటే ఆరోజే నిన్ను బట్టలు ఊడదీసి ఈ మత్స్యకారులే ఊరంతా ఊరేగించేవాళ్ళన్నారు.












Click it and Unblock the Notifications