ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఫలితాలు వెలవడుతున్నాయి. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

ఏకగ్రీవాల్లోనూ వైసీపీ జోరు
రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైసీపీ మద్దతుదారులదే హవా.. టీడీపీ సెకండ్, బీజేపీ-జనసేన అడ్రస్ గల్లంతు
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు రెండో స్థానంలో నిలుస్తున్నారు. అయితే, చాలా తక్కువ స్థానాల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం. ఇక బీజేపీ-జనసేన అభ్యర్థులు ఇప్పటికైతే విజయాన్ని నమోదు చేయలేదు.

అత్యధిక పంచాయతీల్లో జగన్ పార్టీ మద్దతుదారుల గెలుపు
శ్రీకాకుళం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 181, టీడీపీ మద్దతు దారులు-21, ఇతరులు-1
విశాఖపట్నం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 93, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0
తూర్పుగోదావరి:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 73, టీడీపీ మద్దతు దారులు--0, ఇతరులు-0
పశ్చిమగోదావరి:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 100, టీడీపీ మద్దతు దారులు-1,బీజేపీ మద్దతుదారులు-2,ఇతరులు-1
కృష్ణా:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 64, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-1
గుంటూరు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 109, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-0
ప్రకాశం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 95,టీడీపీ మద్దతు దారులు--10, ఇతరులు-0
నెల్లూరు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 90, టీడీపీ మద్దతు దారులు--3, ఇతరులు-1
చిత్తూరు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 242, టీడీపీ మద్దతు దారులు--16, ఇతరులు-1
అనంతపురం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు--9, ఇతరులు-1
కర్నూలు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 111, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-2
కడప:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 63, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం
వైఎస్సార్సీపీ -1383
టీడీపీ -293
బీజేపీ-జనసేన - 6
ఇతరులు- 22 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications