ఏపీలో ఇల్లులేని పేదలకు కేంద్రం తీపికబురు.. కొత్తగా 4లక్షల ఇళ్ళు

ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించటం కోసం ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుంది.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై గ్రామీణ-2.0 పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లు వారం నుంచి పది రోజుల్లోగా కేంద్రం మంజూరు చేసే అవకాశం ఉందని చెప్తోంది.

నాలుగు లక్షల కొత్త ఇళ్ళు ఇవ్వటానికి సుముఖంగా కేంద్రం

కేంద్రం రాష్ట్రానికి నాలుగు లక్షల కొత్త ఇళ్ళు ఇవ్వటానికి సుముఖంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులు అర్హుల వివరాలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. కేంద్ర గృహనిర్మాణ శాఖ కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పీఎంఏవై-2.0 కింద ఇప్పటికే రాష్ట్రానికి 77 వేల గృహాలు మంజూరయ్యాయి. కొత్త 4 లక్షల ఇళ్లు మంజూరైన వెంటనే మొత్తం సంఖ్యను జిల్లాల వారీగా లబ్ధిదారులకు కేటాయించనున్నారు.

AP PMAY gramin 2 0 Andhra Pradesh set to get 4 lakh new rural houses under PMAY Gramin 2 0 within 7-10 days

వివిధ దశల్లో మరో 4 లక్షల గృహాలు

గతంలో పీఎంఏవై పట్టణ-1.0 కింద దాదాపు 19 లక్షల గృహాలు మంజూరయ్యాయి. వాటిలో 2024కు ముందు మంజూరైనవి, ఇంకా నిర్మాణం ప్రారంభం కానివి 3.71 లక్షలు ఉన్నాయి. మరో 4 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడంతో చాలా మంది నిర్మాణం చేపట్టలేదు. దీని కారణంగా కేంద్రం పాతవి పూర్తి చేసిన తర్వాతే కొత్తవి మంజూరు చేస్తామని పట్టుబట్టింది.

రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది ఇల్లు లేని పేదలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, 25 లక్షల బఫర్ స్టాక్ నుంచి 4 లక్షలు కేటాయించేలా ఒప్పించింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది ఇల్లు లేని పేదలు ఉన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం విజయవాడలో అధికారులతో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు.

అంగన్వాడీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక అప్డేట్!
అంగన్వాడీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక అప్డేట్!

ఆదివాసీలకు మంజూరైన 43,592 గృహాలను గడువులోగా పూర్తి

గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిన లేఔట్లను నివాసయోగ్యంగా మార్చేందుకు నిధుల అంచనాలు రూపొందించాలని, నిర్మాణం ప్రారంభం కాని వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పీఎం జన్‌మన్ కింద ఆదివాసీలకు మంజూరైన 43,592 గృహాలను గడువులోగా పూర్తి చేయాలని, దీనికోసం 9 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ఒకవైపు ఇళ్ళు లేని వారికి ఇల్లు ఇస్తూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తం అయిన లే ఔట్ లను నివాస యోగ్యంగా మార్చనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+