ఏపీ పాలీసెట్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..?
ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ - 2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 95.36శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అంతే కాకుండా 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు రావడం హర్షణీయం అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 30న ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్‌కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,840 మంది పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో సీట్లను వారి ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్, సీటు అలాట్‌మెంట్ సహా పలు వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏడాది 'మన మిత్ర' (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై policet పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.
🔊 POLYCET 2025 entrance examination results for admission into Diploma courses in Polytechnics have been announced. 📢
— Lokesh Nara (@naralokesh) May 14, 2025
This year, 1,39,840 candidates have appeared for the Test held on 30.04.2025 and 1,33,358 candidates have passed out with a pass percentage of 95.36%. Glad…
మరోవైపు ఈరోజే ( మే 14, 2025 ) ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఆర్‌జేసీ సెట్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన APRS CET ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://aprs.apcfss.in/ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications