ఏపీకి వర్షాల తీవ్ర హెచ్చరిక ప్రకటించిన బంగాళాఖాతం!
అక్టోబర్ మాసం వచ్చిందంటే వర్షాలు తగ్గుముఖం పట్టాలి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితులు కొనసాగడం లేదు. విపరీతమైన ఎండ ఉక్కపోతతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. కోస్తా ఆంధ్రకు అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూ, తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు.
బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి ఎఫెక్ట్
బంగాళాఖాతంలో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయి. వీటివలన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 7, 8 తేదీలలో తుఫానుకు అవకాశం ఉందని కూడా అంచనా వేసింది.

కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు
రానున్న 24 గంటలలో కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు
ఏపీలో ఈ రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణా సంస్థ అంచనా వేస్తుంది.
ఏపీలోని ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలు
అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖాధికారులు .
నిన్న ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో నిన్న పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా అల్లూరి జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, వైయస్ఆర్ జిల్లా, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. ఆయా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications