ఏపీని వర్షాల విషయంలో వదల బొమ్మాలీ అంటున్న బంగాళాఖాతం!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు
నిన్న నైరుతి బంగాళాఖాతం, ఏపీ దక్షిణ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కూడా కొనసాగుతుందని ఐఎండి పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఇది విస్తరించి ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ap rains update bay of bengal warning on rains in these districts today

రెండు రోజులు జాగ్రత్త
ఇక రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు అనేకచోట్ల వర్ష ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, తిరుపతి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

చలికాలం మొదలైనా కురుస్తున్న వర్షాలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతాకాలం వచ్చిన తర్వాత కూడా వరుసగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం సూర్యారావుపేట గ్రామంలో కురిసిన వర్షాలతో పాటు పిడుగు పడటంతో పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కర్మాగారంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పదిమంది గాయపడ్డారు. గాయపడిన వారిని తణుకు ఆసుపత్రిలో చేర్పించే చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+