హెచ్చరిక.. అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇప్పటికే మూడు రోజులుగా పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా నేడు కూడా పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 16 నుండి 21వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది . ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, యానాం, ఉత్తర కోస్తా మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ.

నేడు ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు
వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి, ఏలూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ పేర్కొన్నారు.
దక్షిణ చత్తీస్ గడ్ మీదుగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు వాన గండం
అంతేకాదు విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఐఎండి సూచనల ప్రకారం విదర్భకు ఆనుకొని ఉన్న దక్షిణ చత్తీస్ గడ్ మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణా సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రెఉ, ఎల్లుండి వానలే వానలు
దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గురు,శుక్రవారాల్లో రెండు మూడు చోట్ల అతిభారీ వరాాలు, అక్కడక్కడ భారీ వరాాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపు వర్షాలు ఈ జిల్లాలలోనే
రేపు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతి కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, గుంటూరు, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications