• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమరావతిలో మరో ఇంటర్నేషనల్ మెగా యూనివర్శిటీ....చంద్ర‌బాబు ఖాతాలో మరో క్రెడిట్

|

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ఫ్యూచర్ డెస్టినీ సిటీగా రూపుదిద్దుకునేందుకు అన్ని హంగులు సమకూరుతున్నాయి. ప్రత్యేకించి విద్యారంగానికి చెందిన అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడకు తరలి వస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ యూనివర్శిటీ తమ విద్యా కార్యకలాపాలను ఇక్కడ విస్తరించడంతో పాటు అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చింది.

అమరావతిలో తమ విద్యా సంస్థలను నెలకొల్పేందుకు పలు యూనివర్శిటీలు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. నవ్యాంధ్ర నూతన రాజధాని నగరం ఇంకా ఒక రూపు రాకముందే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలన్నీ కొలువు దీరుతున్నాయి. లేటెస్టుగా అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎపి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

 యూనివర్శిటీ బృందం సిఎంతో భేటీ...

యూనివర్శిటీ బృందం సిఎంతో భేటీ...

తమ యూనివర్శిటీని అమరావతిలో ఏర్పాటు చేసే విషయమై చర్చించేందుకు పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యింది. పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీటర్ గార్లాండ్, ఇండియానా యూనివర్శిటీ అకడమిక్ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ టిమోతి ఎస్ మోర్లాండ్, రుయా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుహాస్ పెడ్నేకర్ తదిదరులు ఈ బృందంలో ఉన్నారు.

 ఎపితో కలసి పనిచేయాలని...

ఎపితో కలసి పనిచేయాలని...

ఏపీతో కలిసి పనిచేయడానికి తాము అమితాసక్తితో ఉన్నట్టు పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ప్రి-యూనివర్శిటీ కార్యక్రమాలు, స్టూడెంట్ కౌన్సిలింగ్, ఎన్‌రోల్‌మెంట్, విద్యార్థులు, బోధకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు తదిదర అంశాలతో పాటు వృత్తిపరమైన అభివృద్ధి కోసం అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇచ్చే విషయాల గురించి ఈ బృందం సిఎంతో చర్చించింది. అలాగే పరిశోధన, ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్,కోర్సుల రూపకల్పన, వేసవి శిక్షణ వంటి అకడమిక్ కార్యకలాపాలు, ఇంకా పాలనపరమైన పలు వ్యవహారాలలోనూ సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ బృందం తెలిపింది.

 ఒప్పందం కుదిరింది...

ఒప్పందం కుదిరింది...

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకొని లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా తీసుకుంది. దీని ప్రకారం వివిధ అంశాలలో ఏపీలోని విశ్వవిద్యాలయాలకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహకారం అందిస్తాయి. దాదాపు లక్షమంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకరించేలా పెన్సిల్వేనియా వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుంది. విద్య, సాఫ్ట్ వేర్ నైపుణ్యం, వ్యవస్థాపక రంగాలలో ఏపీ సాధించిన మైలురాళ్ల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృందానికి చెప్పారు.

 ఎపి సిఎం ఘనత...

ఎపి సిఎం ఘనత...

అంతర్జాతీయ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్సిస్ట్యూట్ పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ను ఎన్నుకోవడం ద్వారా ఎపి సిఎం చంద్రబాబునాయుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లయింది.

English summary
amaravathi: Many universities have already started their activities to establish their educational institutions in Amaravati. Now an International institute Pennsylvania State System of Higher Education (PASSHE) signed a tripartite agreement with and Andhra Pradesh State Council for Higher Education (APSCHE)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X