ఇంటికో ఉద్యోగం ఎప్పుడిస్తారు?: చంద్రబాబుకు నిరుద్యోగుల సూటి ప్రశ్న..
ఇంటికో ఉద్యోగం ఎప్పుడిస్తారంటూ ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు సీఎంకు సూటి ప్రశ్న వేశారు.
విజయవాడ: బాబు వస్తే ఇంటికో జాబు వస్తుందని గత 2014ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు జోరుగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇచ్చిన ఆ హామి, హామిగానే మిగిలిపోయింది తప్పితే.. వాస్తవరూపం దాల్చలేదని ఏపీ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలం చెందిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలంటూ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి పలు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఇంటికో ఉద్యోగం ఎప్పుడిస్తారంటూ ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు సీఎంకు సూటి ప్రశ్న వేశారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు వైసీపీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఈ సందర్బంగా విద్యార్థులు ఆరోపణలు చేశారు. ఉద్యోగాల కల్పనపై ఈ ప్రభుత్వం అసలేమాత్రం శ్రద్ద పెట్టడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications