వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రలో టిడిపిదే హవా: టిలో పోటాపోటీ, తెరాస ఫస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటిసి, ఎంపిటిసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 1093 జడ్పీటిసిలకు, 16214 ఎంపిటీసిలకు ఎన్నికలు జరిగాయి. 346 ఎంపిటీసిలు ఏకగ్రీవమయ్యాయి. ప్రాదేశిక ఎన్నికలలోను సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. తెలంగాణలో కాంగ్రెసు, తెరాసల మధ్య పోటా పోటీ ఉన్నప్పటికీ... తెరాస కొంత ముందంజలో ఉంది. టిడిపి పరువు నిలుపుకునే అవకాశం కనిపిస్తోంది.

మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు సీమాంధ్రలో.. కాంగ్రెసు పార్టీ 8 ఎంపిటిసి, టిడిపి 1 జెడ్పీటిసి, 422 ఎంపిటిసి, వైయస్సార్ కాంగ్రెసు 353 ఎంపిటిసిలలో గెలుపొందాయి. తెలంగాణలో... కాంగ్రెసు పార్టీ 130 ఎంపిటిసి, టిడిపి 71 ఎంపిటిసి, తెలంగాణ రాష్ట్ర సమితి 170 ఎంపిటిసిలను గెలుచుకున్నాయి.

AP: TDP wave in local bodies election counting

సీమాంధ్రలో... శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో టిడిపి, కడప, కర్నూలు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ముందంజలో ఉన్నాయి. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పోటా పోటీ నెలకొంది. తెలంగాణలో.. అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తెరాస, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో టిడిపి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెసు ముందంజలో ఉంది.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకారణంగా పలు నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చిన బ్యాలెట్ బ్యాక్సులో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో బ్యాలెట్ పత్రాలు తడిచిపోవడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలను ఆరబెట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు మండలం తాడిమలళ్ల, కోరుమామిడి, పెనుగొండ బ్యాలెట్ బాక్సులోకి నీరు చేరాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపూడి మండలం గొల్లలమాడిడాలకు చెందిన ఎనిమిది బాక్సుల్లోకి నీరు చేరడంతో బ్యాలెట్ పేపర్లు తడిసిపోయాయి. కావలిలలో బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టింది.

English summary
Counting votes in ZPTC and MPTC has begun in AP. Polling has been held april 6, 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X