అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: 'జూన్ 27లోపు అందరూ అమరావతికి వచ్చి తీరాల్సిందే' అని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెప్పడంతో హైదరాబాద్ నుంచి ఏపీ తాత్కాలిక సచివాలయానికి పలు శాఖలు తరలించినా వెలగపూడిలోని సచివాలయం వెలవెలబోతుంది. తాత్కాలిక సచివాలయాన్ని బాలారిష్ఠాలు పీడిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే... జూలైలో ముగ్గురు, ఆగస్టు మొదటి వారంలో మరో ముగ్గురు మంత్రులు తాత్కాలికి సచివాలయంలోకి మేళతాళాల మధ్య రంగ ప్రవేశం చేసినా, కనీస వసతులు లేకపోవడంతో ఉద్యోగులు విధులను నిర్వహించలేకపోతున్నారు.

హైదరాబాద్‌ నుంచి కార్గో ద్వారా ఫైళ్లు, ఫర్నీచర్‌ తరలించారు కానీ, కనీసం ఆ డబ్బాలు కూడా విప్పలేని పరిస్థితి తాత్కాలిక సచివాలయంలో ఏర్పడింది. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం సిబ్బంది వేచి చూడాల్సిన దుస్థితి. అంతేకాదు డ్రెయినేజీ, వాటర్‌, క్యాంటీన్‌లాంటి కనీస సౌకర్యాల లేమి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

అసలే వర్షాకాలం వర్షం కురిసిందంటే తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్డంతా బురదమయంగా మారుతోంది. సచివాలయంలోని చాలా గదుల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఓ వైపు నుంచి నిర్మాణాలు జరుగుతుండగా, మరోవైపు గోడలకు ప్లాస్టరింగ్‌, రంగులు వేస్తున్నారు.

తాత్కాలిక సచివాలయంలో ప్రస్తుతానికి ప్రజలకు అవసరమైన పనులు ఏ మాత్రం జరగడంలేదు. ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనే భావన ఉద్యోగుల్లో కలుగుతోంది. మంత్రుల పేషీల్లో మాత్రం తాగడానికి వాటర్ క్యాన్లతో మంచినీటిని తెప్పిస్తున్నారు.

 వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?


తాత్కాలిక సచివాలయంలో క్యాంటీన్‌ కూడా లేదు. కనీసం టీ నీళ్లకూ దిక్కులేకుండా పోయింది. వెలగపూడి నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో ‘అన్న క్యాంటీన్‌' ఉంది. అధికారులు, సచివాలయంలో పనిచేసే సిబ్బందికి అక్కడ తినడం కుదరడంలేదు. దీంతో కొందరు అధికారులు మధ్యాహ్న భోజనం కోసం విజయవాడకు వెళుతున్నారు.

 వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?


దీని ద్వారా చాలా సమయం వృధా అవుతోంది. మరోవైపు ఉద్యోగులు క్యారియర్‌ తెచ్చుకుందామంటే, విజయవాడలో కుటుంబం లేదు. ఇలా తాత్కాలికి సచివాలయం ప్రారంభం అయితే అయింది గానీ, అందులో పనులు సాఫీగా జరగపోగా ఉద్యోగులు మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?


ముఖ్యమంత్రి కార్యాలయం(బ్లాక్‌-1) పక్కనే రెండో బ్లాకులో ఉప ముఖ్యమంత్రుల కార్యాలయాలు, మంత్రి నారాయణ పేషీ, హోం, మునిసిపల్‌ అడ్మినిసేట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ బ్లాకు ముఖద్వారం ఇంకా పూర్తి కాలేదు. మంత్రులు నారాయణ, చినరాజప్ప పేషీల వరకూ పనిని పూర్తి చేసినప్పటికీ, సిబ్బంది కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు.

 వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?


టేబుల్స్ వరకూ ఇంటర్నెట్ కేబుల్‌ లాగి పెట్టినా వాటికి కనెక్షన్‌ లేదు. ఏపీలో ఎక్కువగా పాలన ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుండటంతో ముఖ్యమంత్రి రివ్యూలకు సంబంధించిన పత్రాలను సెక్రటరీలు ల్యాప్‌టాప్‌లో సిద్ధం చేసుకొని విజయవాడలోని ఆయా శాఖల జిల్లా కార్యాలయాల్లో ప్రింట్లు తీసుకొని వెళుతుండటం విశేషం.

 వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?

వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?


సీఎం విధించిన గడువు ‘జూన్‌ 27'కి ఒక్క మంత్రి కూడా రాలేదు. జూలైలో ముగ్గురు మంత్రులు (అయ్యన్నపాత్రుడు, మృణాళిని, కామినేని శ్రీనివాస్‌) వెలగపూడిలో సచివాలయంలోకి ప్రవేశించగా... ఆగస్టు మొదటి వారంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావులు కార్యాలయంలోకి ప్రవేశించారు.

English summary
Marking a 'historic' occasion, four departments of Andhra Pradesh formally moved into the New Government Transitional Headquarters (GTH) – also called the temporary Secretariat -- at Velagapudi village in the state capital region Amaravati on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X