జగన్ కారు ఫిట్ నెస్ రిపోర్ట్ ఇదే..! తప్పెక్కడ జరిగిందంటే ?
ఏపీలో వైఎస్ జగన్ తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్తున్న సమయంలో గుంటూరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య చనిపోయాడంటూ పోలీసులు ఆరోపిస్తుండటం, అంతకు ముందే ఎస్పీ మరో వాహనం కింద పడి సింగయ్య చనిపోయాడంటూ చేసిన ప్రకటనల నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.
సింగయ్య ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నాననే కారణంతో తనపై కేసు నమోదు చేయడం సరికాదని, దీన్ని కొట్టేయాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న వాదనలు జరిగాయి. అయితే దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకూ జగన్ అరెస్టు కాకుండా ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో దీనికి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు.

జగన్ కారుకు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో గతేడాది ఈ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిందని గుర్తించారు. అలాగే 2027 వరకూ ఇన్సూరెన్స్ ఉందని, 2039 వరకూ ఫిట్ నెస్ కూడా ఉందని తేల్చారు. కాబట్టి కారు ఫిట్ నెస్ అనేది ప్రమాదానికి కారణం కాదని తేల్చారు. అయితే మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రవాణాశాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా కార్యకర్తలు భారీగా కారుపైకి వచ్చేందుకు యత్నించడం వల్ల అక్కడక్కడా దెబ్బలు తగిలాయని తేల్చారు. సింగయ్య ప్రమాదం తర్వాత కూడా జగన్ సహా వైసీపీ నేతలు అందులో ప్రయాణించినట్లు గుర్తించారు.
జగన్ ప్రయాణించిన కారు వల్లే సింగయ్య చనిపోయాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసుల్ని హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. దీంతో కారు ఫిట్ నెస్ టెస్టు కూడా చేసారు. అనంతరం పోలీసులు సిద్ధం చేసే తుది రిపోర్టును న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించబోతున్నారు. దీని ఆధారంగా బుధవారం హైకోర్టు జగన్ సహా ఇతర నిందితుల క్వాష్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు.. ఈ కేసులో కారులో ప్రయాణించిన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications