ఏపీలో విద్యా వాలంటీర్ బలి!

ప్రేమ ప్రేమించిన వారి సంతోషాన్ని కోరుకోవాలి, కానీ ప్రేమ ప్రేమించిన వారి వినాశనాన్ని, వారి మృత్యువును కోరుకుంటున్న అనేక ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది వేధింపులకు ఒక యువతీ ప్రాణాలు తీసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే

ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి
విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన రాశి అనే యువతి ప్రేమోన్మాది వేధింపులకు బలైన దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక, జీవితం మీద విరక్తి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP vidya volunteer died with the harassment of a man with the name of love

విద్య వాలంటీరుగా పని చేసే యువతికి వేధింపులు
మజ్జివలస గ్రామానికి చెందిన కాగితాల రాశి అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్య వాలంటీరుగా పనిచేస్తోంది. ఇక మజ్జివలస గ్రామానికే చెందిన పిల్లి రాజు అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నాడు. చాలా సంవత్సరాలు యువతి అతని వేధింపులను భరిస్తూ వస్తోంది.

పురుగుల మందు తాగి మృతి
అయితే ఈ మధ్య రాజు వేధింపులు మరీ ఎక్కువ కావటంతో ఓపిక నశించిన రాశి, రాజు కారణంగా అనుభవిస్తున్న నరకం కన్నా మరణమే మేలని భావించింది. పొలానికి చల్లే పురుగుమందును తాగింది. రాశి పురుగుల మందు తాగిన విషయం గమినించిన తల్లిందండ్రులు ఆమెనుం చికిత్స నిమిత్తం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె మృత్యువుతో పోరాడి చివరకు మరణించింది.

AP vidya volunteer died with the harassment of a man with the name of love

నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
నవంబర్ 21న రాశి మరణించగా, 22వ తేదీన రాశి అంత్యక్రియలు వారి స్వగ్రామమైన మజ్జి వలసలోనే నిర్వహించారు. ఇక తమ కుమార్తె మరణానికి కారణమైన రాజుపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు చేయగా రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాజు రిమాండ్‌లో ఉన్నాడు. ఒక యువతిని మానసిక వేదనకు గురి చేసి, ప్రేమ పేరుతో హింసించిన రాజును కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+