హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనీస్, ఆంగ్ల భాషల్లో బాబు డాక్యుమెంటరీ (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చైనా నుంచి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం 4.5 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించింది. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఏవిధంగా అనుకూలమో వివరించి, ఏఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నదీ ఈ వీడియోలో సంక్షిప్తంగా పొందుపరిచారు.

ఈ నెల 12 నుంచి 17 వరకు చంద్రబాబు బృందం చైనా పర్యటనలో పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు బృందం మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటాయి. ఈ సమావేశాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు.

చైనీస్, ఆంగ్ల భాషల్లో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. 'ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం. దృఢమైన ఆర్ధిక వ్వవస్ధ, సందడైన పారిశ్రామిక దృశ్యం, సానుకూల వాణిజ్య వాతావరణం రాష్ట్రం సొంతం. 2029 నాటికి అభివృద్ధిపరంగా దేశంలో తొలిస్ధానంలో నిలవాలన్న లక్ష్యంతో ముందడువేస్తోంది' అని మొదలవుతుంది.

ఆ తర్వాత 'ప్రగతిపథంలో వెళ్తున్నాం. మీరు మా ప్రత్యేక ఆహ్వానితులు. మీ భవిష్యత్తుకు స్వాగతం పలికేందుకు మా రాష్ట్రం సిద్దమైంది' అన్న వ్యాఖ్యానంతో ఈ డాక్యుమెంటరీ ముగిస్తుందని తెలుస్తోంది.

English summary
AP vision documentary in english and china shows by Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X