AP rain alert: ఏపీలో మరో మూడ్రోజులపాటు సాధారణం నుంచి భారీ వర్షాలు

అమరావతి: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటినుంచి మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‎లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

AP weather alert: three more days Normal to heavy rains in few district in andhra pradesh

మంగళవారం కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    దక్షిణ కోస్తాంధ్రాలో మంగళవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి రానున్న మూడు రోజులపాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+