AP weather: ఏపీలో మరో ముడ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, కోస్తావైపు అల్పపీడనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రైతులు వేసిన పంటలు నీటమునగడం, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కూడా వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాను తాకనున్న అల్పపీడనం

కోస్తాను తాకనున్న అల్పపీడనం

నిన్న(మంగళవారం) ఆగ్నేయ బంగాళా ఖాతం దాని సరిహద్దునున్న ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడనం బుధవారం ఆగ్నేయ బంగాళా ఖాతం దాని సరిహద్దుని ఆను కొని ఉన్ననైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అంతేగాక, ఈ అల్పపీడనం దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టము నకు 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందన్నారు. ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి , పశ్చిమ మధ్య , దానిని ఆను కొని ఉన్ననైరుతి బంగాళా ఖాతం వద్ద నున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాన్నీ గురువారం ఉదయం తాకనుందని చెప్పారు. మరొక అల్పపీడన ద్రోణి అరేబియా సముద్రం దాని పరిసర ప్రాంతమైన గోవా, దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు గల అల్పపీడనం, దానికి అనుబంధంగా గల ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉందన్నారు. దీంతో రాగాల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తరకోస్తా, యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఉత్తరకోస్తా, యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

యానాం, ఉత్తరకోస్తాంధ్రాలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అంతేగాక, గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు

మరోవైపు, బుధవారం దక్షిణ కోస్తాంధ్రా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది . భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
    రాయలసీమలోనూ అత్యంత భారీ వర్షాలు

    రాయలసీమలోనూ అత్యంత భారీ వర్షాలు

    ఇక, రాయలసీమలోనూ బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులు.. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంపైకి వెళ్లే మత్స్యకారులకు సూచనలు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+