AP Weather: ఏపీలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం బుధవారం కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతోంది.

ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు

ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు

తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి పైన తెలిపిన కోస్తా తమిళనాడులో గల ఉపరితల ఆవర్తనం నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రము వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య కొనసాగుతోంది. దీని ఫలితంగా రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితుల గురించిన వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. అలాగే శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది. గురువారం దక్షిణ కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలో కురిసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
    రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు

    రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు

    ఇక రాయలసీమ ప్రాంతంలో బుధవారం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో కూడా జలకళతో ఉన్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు వరద నీటితో మునిగిపోతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+