షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే

ఒకప్పుడు పెళ్లి అంటే యువత కలలు కనేవాళ్ళు. తనకు ఎటువంటి భార్య వస్తుంది? ఎటువంటి భర్త వస్తాడు? తమ జీవితం ఎలా ఉంటుంది? అని గంపెడు ఆశలతో ఎదురుచూసేవారు. పెళ్లి అన్న పేరెత్తితే సిగ్గుల మొలకలు అయ్యే వాళ్ళు. అలాంటిదిప్పుడు పెళ్లి పేరు ఎత్తితే... అవసరమా పెళ్లి? మాకెందుకు ఈ గోల? బ్రతకడమే కష్టంగా ఉంటే పెళ్లి చేసుకుని ఏం చేయమంటారు? ఇటువంటి నిరాశజనితమైన సమాధానాలు యువత నుంచి వస్తున్నాయి.

యువతలో పెళ్లిపై అనాసక్తి

ఇది కేవలం ఏ ఒక్క ఇంట్లోనో ఉన్న పిల్లలకు పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి సమాధానం చెబుతున్న యువత సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పెళ్లి పట్ల అనాసక్తతని వ్యక్తపరుస్తుంది యువత. ప్రస్తుతం ప్రపంచంలో చదువు, కెరీర్ అన్నింట్లో వచ్చిన మార్పులు, యువతపైన పెరిగిపోయిన విపరీతమైన ఒత్తిడి, యువత పెళ్లి పట్ల అనాసక్తి చూపడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు.

AP youth disinterest in marriage parenthood as lifestyle changes high living costs and job insecurity

సంతానానికి సంబంధించిన ఏపీ గణాంకాలు ఇలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానం విషయంలో గణాంకాలను చూస్తే రాష్ట్రంలో ఒక్క బిడ్డ మాత్రమే ఉన్న దంపతులు 47. 92 శాతం వరకు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారు 44.16%, ముగ్గురు సంతానం ఉన్నవారు 7.18 శాతం ఉన్నారు. ఇక నలుగురు సంతానం ఉన్నవారు 0.67%, ఐదుగురు సంతానం ఉన్నవారు 0.07 శాతం, ఆరుగురు సంతానం అంతకంటే ఎక్కువ ఉన్నవారు 0.01 శాతం వరకు ఉన్నారు.

పిల్లలను కనే విషయంలోనూ మారుతున్న యువత ఆలోచనా తీరు

ఈ గణాంకాలు పిల్లలను కనే విషయంలో యువత ఆలోచన ధోరణి మారుతున్న తీరును స్పష్టంగా చూపిస్తున్నాయి.ఈ గణాంకాలు పిల్లలను కనే విషయంలో యువత ఆలోచనాధోరణి మారుతున్న తీరును స్పష్టంగా చూపిస్తున్నాయి. చిన్న కుటుంబాల వైపు నేటి యువత మొగ్గు చూపుతోంది. ఇక ఈ మధ్య కాలంలో అసలు పెళ్లి వద్దనే వారు ఎక్కువైపోయారు.

ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్న ఏపీ సీఎం

ఏపీలో బాగా ఫెర్టిలిటీ శాతం బాగా తగ్గుతున్న క్రమంలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, అధిక సంతానాన్ని కన్నవారిని ప్రోత్సహిస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే ఏపీలో యువత పిల్లలు మాట అటుంచి, ముందు పెళ్లి మాకొద్దు అంటూ మోరాయిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యతలు అన్ని నెరవేర్చాలని భయపడుతున్నారు.

యువతలో మానసిక ఒత్తిడి.. పెళ్లిపై పెరుగుతున్న భయం

ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తాము బ్రతకడమే కష్టంగా ఉందని వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే జనాభా పెరగడం మాట అటుంచి జనాభా మరింత తగ్గిపోయే ప్రమాదం వస్తుంది. యువతలో ఉద్యోగాల భద్రత లేకపోవటంపై పెరిగిన మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+