APCO : ఆప్కోలో మేనేజర్, సేల్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు-కేవలం ఇంటర్వ్యూతోనే..
ఏపీ ప్రభుత్వ రంగ సంస్ధ ఆప్కోలో ఉద్యోగాల భర్తీకి ఇవాళ ప్రకటన వెలువడింది. రెండు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి ఆప్కో ప్రకటన ఇచ్చింది. ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హతతో మేనేజర్లు, సేల్స్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా విద్యార్హతలు, అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను ఆప్కో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలోని ఆప్కో చేనేత వస్త్ర విక్రయశాలలలో మేనేజర్లు, అమ్మకాల సహాయకులుగా పని చేయుటకు అర్హత కలిగిన వారిని నేరుగా ఇంటర్వ్యూ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వీసీ, ఎండీ ఇవాళ తెలిపారు. విక్రయ రంగంలో ఆసక్తి కలిగి ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలవారు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. అలాగే ఈ ఉద్యోగాల ఎంపిక విధానం కూడా వివరించారు.

మేనేజర్, సేల్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాతో జూలై మూడవ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ, గవర్నర్ పేట, రహమాన్ పార్క్ దగ్గరలోని ఆప్కో కేంద్ర కార్యాలయం నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని వీసీ ఎండీ వివరించారు. ఎంపికైన వారికి కనిష్టంగా రూ.9వేలకు పైన, ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా వేతనం నిర్ణయిస్తామని వెల్లడించారు.
ఆప్కోలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలు కేవలం ఔట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం ఆప్కో వెబ్ సైట్ ను లాగిన్ కావాలని అధికారులు సూచించారు. ఆప్కో సంస్థ, విక్రయశాలల వివరాలు గురించిన పూర్తి సమాచారం www.apcohandlooms.com వెబ్ సైట్ నుండి తెలుసుకోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications