APCRDA: అమరావతిపై సీఆర్డీఏ కీలక నిర్ణయాలు..! క్వాంటం, ఆయుష్ సహా..!
అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరుగులు తీయిచాలని భావిస్తున్న కూటమి సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ సీఆర్డీయే అథారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే 65వ అధారిటీ సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన పలు ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు.
అమరావతి లో క్వాంటం వ్యాలీకి సంబంధించిన సామాగ్రి కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అధారిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి ఎల్1ని ఖరారు చేశారు. ఈ ప్రత్యేక భవనం రెండు ఎకరాల విస్తీర్ణంలో టెక్నికల్ నిపుణుల డిజైన్ ప్రకారం నిర్మించనున్నారు. దీంతో పాటు క్వాంటం వ్యాలీలో మరో రెండు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలకు అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు 109.52కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆసుపత్రి, యూనివర్సిటీ కోసం 60 ఏళ్ల పాటు ఎకరం రూపాయి చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో 750 కోట్లతో ఆయుష్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. అమరావతిలో వరద నివారణకు కొండవీటి వాగు , పాలవాగు , గ్రావీటి కెనాల్ తో పాటు ఆరు రిజర్వాయర్ లు ఇప్పటికే ప్రతిపాదించారు. వీటితో పాటు కొత్తగా గుంటూరు ఛానల్ ద్వారా 4వేల క్యూసెక్కులు బయటికి పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు.

ఇప్పడున్న పంపింగ్ సామర్ధ్యానికి అధనంగా మరో 8500క్యూసెక్కుల సామర్ధ్యం గల పంపింగ్ స్టేషన్ ను 443 కోట్లతో ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది. ఎల్పీఎస్ జోన్ 8లో 1351కోట్లతో పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. జరీబు ,నాన్ జరీబు భూముల సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications