Actress: బాలీవుడ్ నటి కేసులో ట్విస్ట్, కౌంటర్ వేస్తామంటున్న ఏజీ

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది అంటున్నారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని, ఈ కేసుతో వీళ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని, అంత వరకు నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మనవి చేశారు.

ఈ కేసులో పూర్తి వివరాలతో తాము అఫిడవిట్ దాఖలు చేసే వరకు ఐపీఎస్ అధికారులకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని హైకోర్టుకు మనవి చేశారు. ముంబాయి నటి జెత్వానీ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఈనెల 15వ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు.

Appeal to High Court not to grant anticipatory bail to police officers in Bollywood actress case

ఇదే సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ క్రాంతి రాణా, సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు, హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తనను తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేశారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను జైల్లో పెట్టారని, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ పైన తెలిపిన పోలీసు అధికారులందిపై కేసు పెట్టింది.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని, వాళ్ళు తప్పు చేసినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అంటున్నారు.

అయితే ఈ కేసులో పోలీస్ అధికారులపై తొందరపాటు చర్యలు తీసుకోరాదని, వాళ్లను అరెస్టు చేయకూడదని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇదే నెల 15 వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముంబాయి నటి కాదంబరీ జెత్వానీ కేసు విషయంలో తమకు కొత్త విషయాలు తెలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+