ఈ నూనె రాస్తే జట్టు ఒత్తుగా పెరుగుతుంది

ఎక్కువమంది ఆరోగ్యం, చర్మంపై పెట్టిన శ్రద్ధ జుట్టుపై పెట్టరని.. దీనివల్లే జాట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు డ్రైగా కనపడినా, చర్మం కూడా అలాగే ఉన్నా మనం సరైన ఆరోగ్యంగా లేవనే విషయాన్ని సూచిస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటి చిట్కాలు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తుంటాయి.

​ఆయిల్ మసాజ్ : మనకు చిరాగ్గా ఉన్నప్పుడు తలపై కొబ్బరినూనె పెట్టుకొని మసాజ్ చేస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మనకే కాదు.. జుట్టు కూడా రిలీఫ్ ఫీలవుతుంది. డ్రైగా మారడం, జట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

 hairstyles-for-thick-hair

​అందమైన జుట్టుకోసం : నూనెతో మసాజ్ చేయడంవల్ల ఎటువంటి సమస్యలు లేకుండా జుట్టు బలంగా పెరుగుతుంది. కొన్ని పదార్థాలతో మనం ఇంట్లోనే నూనెను తయారుచేసుకోవచ్చు. ముందుగా కొబ్బరినూనె తీసుకొని వేడి చేయాలి. అందులో కరివేపాకు, తర్వాత మెంతులు, మందారపువ్వు వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ హలీమ్ సీడ్స్ (గార్డెన్ క్రస్) వేయాలి. వాటిని ఒక రాత్రి మొత్తం అలాగే ఉంచాలి. ఉదయాన్నే వడగట్టి ఆయిల్ మసాజ్ చేయాలి. ఇలా తయారైన నూనెను వారానికి ఒకసారి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 30 నిముషాలు కుదిరితే ఒక రాత్రి మొత్తం అలాగే ఉంచి షాంపూ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుండటంవల్ల జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.

జుట్టుకు నూనె అప్లై చేయడానికి ముందు జుట్టు మూలాలు, జుట్టు చివర్లు శుభ్రంగా ఉండాలి. అప్లై చేయడానికి ముందు చేతులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వెంట్రుకలు, చేతులు మురికిగా ఉంటే.. నూనె అప్లై చేయకూడదు. జుట్టు మురికిగా ఉన్నప్పుడు నూనెతో తలకు మసాజ్‌ చేస్తే జుట్టు కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోతాయి. నూనె రాసినా జుట్టు మూలల్లోకి వెళ్లలేదు. నూనె రాసినా ప్రయోజనం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+