Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APPSC Exams Schedule: ఏపీపీఎస్సీ 21 పరీక్షల షెడ్యూల్-జనవరి, ఫిబ్రవరిలో తేదీలివే..!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం పరీక్షల తేదీల్ని ప్రకటించింది. ఈ మేరకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 890 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ఈ ఏడాది 21 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటికి పరీక్షల్ని వచ్చే రెండు నెలల్లో నిర్వహించబోతున్నారు. ఆ మేరకు వెబ్ సైట్ లో పూర్తి వివరాలను వెల్లడించింది.

ఈ ఏడాది విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీల్ని నిర్ధారిస్తూ ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షల్ని కొత్త ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వివిధ తేదీల్లో నిర్వహించబోతున్నారు. ఏయే పరీక్షను ఏయే తేదీల్లో నిర్వహించబోతున్నారో వివరిస్తూ ఏపీపీఎస్సీ జాబ్ షెడ్యూల్ చార్జ్ విడుదల చేసింది. ఇప్పటికే ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఆయా తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

APPSC Exam Alert Dates Released for 21 Recruitment Tests in January amp amp February 2026

తాజా షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షలు జనవరి 27వ తేదీ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకూ పేపర్ 1, 28వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ పేపర్ 2 నిర్వహిస్తారు. అలాగే ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ పరీక్షను జనవరి 27వ తేదీ ఉదయం పేపర్ 1, 28వ తేదీ మధ్యాహ్నం పేపర్ 2 నిర్వహిస్తారు. ఏపీ ఇంటర్ ఎడ్యుకేషన్ లో లేబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్ పరీక్ష కూడా జనవరి 27వ తేదీ ఉదయం పేపర్ 1, 28వ తేదీ మధ్యాహ్నం పేపర్ 2 నిర్వహిస్తారు.

ఏపీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు పరీక్షలు జనవరి 27న ఉదయం పేపర్ 1, 28న మధ్యాహ్నం పేపర్ 2 ఉంటాయి. ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు కూడా జనవరి 27న ఉదయం పేపర్ 1, 28న మధ్యాహ్నం పేపర్ 2 నిర్వహిస్తారు. ఏపీ హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుకు జనవరి 27న ఉదయం పేపర్ 1, జనవరి 28న ఉదయం జనరల్ ఇంగ్లీష్-తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్, 29న మధ్యాహ్నం పేపర్ 1, 30న ఉదయం పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు.

వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం జనవరి 27న ఉదయం పేపర్ 1, 30న ఉదయం సెషన్ లో పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల కోసం జనవరి 27న ఉదయం పేపర్ 1, 28న ఉదయం పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. ఏపీ జైళ్లశాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు కోసం జనవరి 27న ఉదయం, 30న ఉదయం పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టుకు జనవరి 27న ఉదయం పేపర్ 1, 29న మధ్యాహ్నం పేపర్ 2 నిర్వహిస్తారు.

సంక్షేమ వార్డెన్ పోస్టులకు జనవరి 27న ఉదయం పేపర్ 1, 29న ఉదయం పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. మైనింగ్ శాఖలో రాయల్టీ ఇన్ స్పెక్టర్ పోస్టులకు జనవరి 27న ఉదయం పేపర్ 1, 28న మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. ఏపీ ఫ్యాక్టరీస్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు కూడా జనవరి 27న ఉదయం పేపర్ 1, 29న ఉదయం పేపర్ 2 పరీక్షలుంటాయి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు కూడా జనవరి 27న ఉదయం పేపర్ 1, 30న ఉదయం పేపర్ 2 పరీక్షలుంటాయి. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 27న ఉదయం పేపర్ 1, 30న ఉదయం పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు.

APPSC Exam Alert Dates Released for 21 Recruitment Tests in January amp amp February 2026

ఏపీ సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు జనవరి 27న ఉదయం పేపర్ 1, 28న ఉదయం పేపర్ 2 పరీక్షలుంటాయి. ఏపీ అటవీ శాఖలో డ్రాఫ్ట్స్ మెన్ పోస్టుకు జనవరి 29న పేపర్ 2, 31న పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు ఫిబ్రవరి 9న ఉదయం క్వాలిఫైయింగ్ టెస్ట్, మధ్యాహ్నం పేపర్ 1 పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే 10వ తేదీన పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఇదే శాఖలో థానేదార్ పోస్టుకు ఫిబ్రవరి 9న ఉదయం క్వాలిఫైయింగ్ పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 1 పరీక్ష, 10వ తేదీన పేపర్ 2 పరీక్ష ఉంటాయి. దేవాదాయశాఖలో ఈవో పోస్టుకు ఫిబ్రవరి 11న ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు మెయిన్స్ ఫిబ్రవరి 12న ఉదయం క్వాలిఫైయింగ్ టెస్ట్, మధ్యాహ్నం పేపర్ 1, 13వ తేదీ ఉదయం పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+