ఏపీలో నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుక!: 446 గ్రూప్-2 ఖాళీలు సహా 7 నోటిఫికేషన్లు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు నూతన సంవత్సర శుభవార్తను అందించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీపీఎస్సీ సోమవారం 446 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 7 నోటిఫికేషన్లను, 1418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు తేదీలను ప్రకటించింది.

పాలిటెక్నికల్ లెక్చరర్లు- 500 ఖాళీలు, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు - 43 ఖాళీలు, గ్రూప్ 2 ఉద్యోగాలు- 446, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు - 308, గ్రూప్ 1 పోస్టులు - 106, అసిస్టెంట్ ఫిషరీస్ పోస్టులు - 10, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులు - 5కు నోటిఫికేషన్లు జారీ చేసింది.

 APPSC Group 2 Notification 2019 Apply Online For 446 Posts

గ్రూప్ 2లో 110 పాత పోస్టులతో పాటు కొత్తగా 336 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సచివాలయంలోని జీడీ విభాగానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో 150 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు - 3, డిప్యూటీ తహసీల్దారు, ఈవోపీఆర్డీ, అబ్కారీ శాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ, దేవాదాయ శాఖలో గ్రేడ్ 2, గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+