ఏపీలో ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు పెరిగి మరో వేసవి తలపిస్తోంది. ఈ సమయంలోనే ఏపీఎస్డీఎంఏ తాజా అలర్ట్జ్ జారీ చేసింది. ఎనిమిది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ జిల్లాల్లో వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే విధంగా ఇతర ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల సమీపంలో ఆశ్రయం పొందవద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కలెక్టర్ నివేదిక: అక్కడ ఎన్నికలు వాయిదా- ఎన్నికల సంఘం నిర్ణయం..!!
కలెక్టర్ నివేదిక: అక్కడ ఎన్నికలు వాయిదా- ఎన్నికల సంఘం నిర్ణయం..!!
apsdma-predicts-rains-for-many-areas-in-coastal-and-north-andhra-for-next-three-days-here-the-repo

ఈ జిల్లాలకు కీలక సూచనలు

అదే విధంగా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు హెచ్చరికలను గమనించాలని సూచించారు. కాగా.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. దీంతో, అవసరమైన చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+