మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. మండుతున్న ఎండల వేళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీలో.. అటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపుల తోపాటు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాలకు రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితుల పైన అలర్ట్స్ జారీ చేసింది.
ఏపీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటుగా ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రోజు ఏపీలో మన్యం, అల్లూరి, పోల వరం, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,శ్రీసత్యసాయి,కడప,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగుల తో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

మూడు రోజుల పాటు వర్షాల పై అలర్ట్స్
ఈ రోజు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. అదే విధంగా ఈ నెల 25న ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, గదిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications