కేవలం వంద రూపాయలతో విశాఖ అందాలు చూసే ఆఫరిచ్చిన ఆర్టీసీ!

రాష్ట్రంలోని విశాఖ నగరానికి పర్యాటక నగరంగా ఎంతో మంచి పేరుంది. ప్రతి సంవత్సరం ఎంతో మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న విశాఖ నగరం విశాలమైన తీర ప్రాంతంతో, అద్భుతమైన బీచ్ లతో మనసులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అటువంటి విశాఖ నగరాన్ని చూడడానికి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి చాలా ప్రాధాన్యతను ఇస్తుంది.

విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులకు బంపర్ ఆఫర్
ఇందులో భాగంగా apsrtc విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం బంపర్ ఆఫర్ ను గత కొంతకాలంగా కొనసాగిస్తోంది. ట్రావెల్ యాజ్ యు లైక్ పేరుతో కేవలం 100 రూపాయలతోనే రోజంతా నగరంలో ఎక్కడ నుంచైనా, ఎక్కడి వరకైనా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ ద్వారా కల్పిస్తుంది. ఇది పర్యాటకులకు లబ్ధి చేకూర్చడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు కూడా మేలు చేకూరుస్తుంది.

APSRTC bumper offer for tourists going to Visakhapatnam only with 100 rupees

Take a Poll

రూ.100 తోనే అద్భుతమైన ఆఫర్
ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీంతో మహిళలు ఉచిత బస్సులలో ఎంచక్కా విశాఖ నగరాన్ని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంలోని పురుషుల కోసం కూడా ఈ కొత్త బంపర్ ఆఫర్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా కుటుంబమంతా తక్కువ ఖర్చుతోనే విశాఖ నగరాన్ని చుట్టి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. రూ.100 తోనే ఇటువంటి అద్భుతమైన ఆఫర్ ఇచ్చినందుకు ఏపీఎస్ఆర్టీసీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

విశాఖలో ఈ పర్యాటక ప్రాంతాలకు వంద రూపాయలతోనే
ఇక విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, ఎండాడ బీచ్ వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో బీచ్ కు దానిదైన ప్రత్యేకత ఉంది. ఈ బీచ్ ల మధ్య దూరం కూడా దాదాపు 30కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతేకాదు నగరంలో తొట్లకొండ, ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, సింహాచలం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాంతాలను చూడడానికి కూడా అవకాశం ఉంది.

విశాఖ నగరంలో కేవలం 100 రూపాయలతోనే రోజంతా ప్రయాణం
దాదాపు 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విశాఖ నగరంలో కేవలం 100 రూపాయలతోనే రోజంతా ప్రయాణం చేసే అరుదైన అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ టికెట్ ను కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా మాత్రమే కాకుండా, పర్యాటక ప్రాంతాలను సులభంగా సునాయాసంగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల లోపు మాత్రమే పనిచేస్తుంది.

ఆ బస్సులలో ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లు
విశాఖలోని సందర్శనీయ ప్రాంతాలను చూడాలి అనుకునే వారికి ఆర్టీసీ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. విశాఖ నగరంలోని ఏ బస్సు ఎక్కిన కండక్టర్ ను అడిగి ఈ ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లు తీసుకోవచ్చు. సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఈ టికెట్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వంద రూపాయల టికెట్ తీసుకుని 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విశాఖ నగర అందాలను చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+