ప్రయాణీకులకు APSRTC గుడ్ న్యూస్, ఇక నుంచి..!!

APSRTC ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ విధానం మరింత సులభతరం చేసేలా మార్పులు తెస్తోంది. ఇప్పటికే ఉన్న విధానాలతో పాటుగా కొత్తగా గుగూల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. గుగూల్ మ్యాప్స్ లో అన్ని బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన సర్వీసులో టికెట్ బుక్ చేసుకొనేలా వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. వాట్సప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి రద్దీ వేళ అదనపు బస్సుల పైన ఆర్టీసీ అదనపు బస్సుల నిర్వహణకు సిద్దమైంది.

ప్రయాణీకులకు ప్రస్తుతం ఆర్టీసీలో బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్‌సైట్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కూడా బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్‌ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల వివరాలను చూపించి, దాని ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.

apsrtc-launches-new-system-for-ticket-reservation-for-passengers-details-here

గూగుల్‌ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం అని టైప్‌ చేస్తే వీటి మధ్య దూరం ఎంత, బైక్, కారు, బస్, రైళ్లలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు జనరల్‌ ట్రాన్సిట్‌ స్పీడ్‌ స్పెసిఫికేషన్‌ (జీటీఎస్‌ఎఫ్‌) ద్వారా కనిపిస్తాయి. అదే విధంగా వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపిస్తే చాలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్(మన మిత్ర) ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం గురించి ప్రయాణీకులలో అవగాహన చాలా తక్కువగా ఉందని.. అందువల్ల ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికి, ఈ వాట్సాప్ సేవను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది.

తెలుగు, ఇంగ్లీష్ భాషలలో వాట్సాప్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీని ద్వారా ముందుగా టికెట్ బుకింగ్‌ను ఎంచుకుని ప్రయాణ వివరాలు, ప్రయాణీకుల సమాచారాన్ని నమోదు చేసి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే టికెట్ వెంటనే బుక్ అవుతుంది. టికెట్‌ను కూడా వెంటనే వాట్సాప్ ద్వారా పొందవచ్చని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా సంక్రాంతి వేళ ప్రయాణీకులకు రద్దీ మార్గాల్లో అదనపు సర్వీసుల ఖరారు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+