Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APSRTC: అన్ ఫిట్ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్..! జీవో జారీ..!

ఏపీఎస్ ఆర్టీసీలో తాజాగా పలు సంస్కరణలు చేపడుతున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగులు పని భారం పెరుగుతోందని, అందుకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సహకారం అందించడం లేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో గతంలో రద్దు చేసిన ఓ పథకాన్ని తిరిగి వారికి అమలు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్టీసి లో అన్ ఫిట్ అయిన (ఫిట్ నెస్ లేని) ఉద్యోగులకు గతంలో ఇచ్చినట్లుగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని లేదా అదనపు ఆర్దిక సాయం అందించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ గా అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ఆపేసిన ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా అదనపు ఆర్దిక సాయం పథకాన్ని కానీ తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది.

APSRTC Reinstates Alternative Jobs or Monetary Benefits for Unfit Employees

తాజా ఉత్తర్వుల ప్రకారం ఆర్టీసీలో జనవరి 1, 2020 తర్వాత మెడికల్ గా అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు పాత పద్దతిలో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పిస్తారు. అది వద్దంటే అదనపు ఆర్ధిక సాయం అందించే విధానం కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఇకపై ఆర్టీసీలో అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు సైతం ఈ జీవో ప్రకారం ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా అదనపు ఆర్ధిక సాయం లభించేందుకు మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో అందులో ఒక్కొక్క అంశాన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

APSRTC Reinstates Alternative Jobs or Monetary Benefits for Unfit Employees

ఆర్టీసీ అన్ ఫిట్ ఉద్యోగులకు ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఉద్యోగులకు ప్రాధాన్యత క్రమంలో నియామకాలు చేపడతామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగుల జాబితాలో లేని ఉద్యోగులకు మానిటరీ కాంపెన్సేషన్ కొనసాగిస్తామన్నారు. ఉద్యోగుల జీవన భద్రత, కుటుంబాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరూ నష్టపోకుండా చూడటం కూటమి ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలోకి విలీనం అయిన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలన చేస్తుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+