ప్రయాణికులకు APSRTC గుడ్ న్యూస్
డిసెంబర్ 16వ తేదీ నుండి పవిత్ర ధనుర్మాసం ఆరంభం కానుంది. మధ్యాహ్నం 1:23 నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమౌతాయి. ఈ సందర్భంగా వైష్ణవాలయాలన్నీ కూడా ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. తిరుమల సహా టీటీడీ ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలకు బదులుగా తిరుప్పావై పాశురాలను వినిపిస్తారు. జనవరి 14వ తేదీ వరకు ఈ సంప్రదాయం కొనసాగుతుంది.
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, తిరుచానూరు, గోవిందరాజస్వామి, కోదండ రామస్వామి, అప్పలాయగుంటప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ధనుర్మాసం ఉత్సవాలు నడుస్తాయి.

ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ధనుర్మాసంలో ఆలయాలను సందర్శించడానికి భక్తుల కోసం నవజనార్దన క్షేత్ర దర్శిని పేరిట ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 28, జనవరి 4 తేదీల్లో నవజనార్దన క్షేత్రాలకు ఈ బస్సులు నడిపిస్తారు. ఈ బస్సుల ద్వారా ఒకే రోజు తొమ్మిది క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఒకేరోజు- ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, మాచర, కోటిపల్లిల్లో వెలసిన జనార్దన స్వామివారి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. దీనికి చెల్లించాల్సిన టికెట్ ఒక్కొక్కరికీ 450 రూపాయలు. ఈ బస్సుల కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. కార్తీకమాసంలో శైవక్షేత్రాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక బస్సులు, ప్యాకేజీ టూర్లకు యాత్రీకుల నుంచి అపూర్వ ఆదరణ అందిన నేపథ్యంలో తాజాగా ధనుర్మాసంలోనూ దీన్ని అమలు చేస్తోన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications