APSRTC: సమ్మర్ స్పెషల్: విజయవాడ టు డ్రీమ్ డెస్టినేషన్.!!

అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే దీనిపై పలు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పలు ప్యాకేజీలను ఏపీటీడీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి సందర్శకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది.

ఏపీటీడీసీ బాటలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంట్రీ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేస్తోన్న టూరిజం ప్యాకేజీ తరహాలోనే ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాడులోని అరుణాచలానికి మెజారిటీ డిపోల నుంచి బస్సులను నడిపిస్తోంది. ఇప్పుడు వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా అరకులోయకు వీకెండ్ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Operating a special service to Araku Valley from Vijayawada

ఈ సమ్మర్ వీకెండ్ స్పెషల్ ప్యాకేజీ టూర్ కింద ప్రత్యేక బస్సు సర్వీసును ప్రవేశపెట్టింది. విజయవాడ నుంచి అరకులోయ మధ్య ఈ స్పెషల్ బస్సు రాకపోకలు సాగిస్తుంది. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అరుకులోయకు బయలుదేరి వెళ్తుంది ఈ బస్సు. మళ్లీ సోమవారం తెల్లవారు జామున విజయవాడకు చేరుకుంటుంది.

ఈ బస్ సర్వీస్ నంబర్ 95400. నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ ఇది. ఈ టూర్ ప్యాకేజీ కింద ప్రయాణికులు లంబసింగి, తంజింగి రిజర్వాయర్, వంజంగి హిల్స్, మత్స్యగుండం, అరకులోయ ట్రైబల్ మ్యూజియం, అరకు పద్మాపురం గార్డెన్స్, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు, తైదా జంగిల్ బెల్స్‌ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ బస్ ఛార్జీ రానుపోను 2,050 రూపాయలు.

ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ వద్ద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకరోజు ట్రిప్ కావడం వల్ల వసతి సౌకర్యాన్ని కల్పించట్లేదు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల సంఖ్య 30 కంటే అధికంగా ఉంటే పండింట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు బదులుగా వారు కోరుకున్న చోటు నుంచే బస్సు సర్వీసును అందుబాటులో ఉంచుతామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+