ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - ఇక నుంచి..!!
APSRTC ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ విధానం మరింత సులభతరం చేసేలా మార్పులు తెస్తోంది. ఇప్పటికే ఉన్న విధానాలతో పాటుగా కొత్తగా గుగూల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. వాట్సప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. గుగూల్ మ్యాప్స్ లో అన్ని బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన సర్వీసులో టికెట్ బుక్ చేసుకొనేలా వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రయాణీకులకు ప్రస్తుతం ఆర్టీసీలో బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల వివరాలను చూపించి, దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. గూగుల్ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం అని టైప్ చేస్తే వీటి మధ్య దూరం ఎంత, బైక్, కారు, బస్, రైళ్లలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు జనరల్ ట్రాన్సిట్ స్పీడ్ స్పెసిఫికేషన్ (జీటీఎస్‌ఎఫ్) ద్వారా కనిపిస్తాయి.

అందులో బస్ సింబల్ ఉన్నచోట క్లిక్ చేస్తే విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఎన్ని ఆర్టీసీ బస్సుల వివరాలు..సమయాలు..ఎన్ని గంటల్లో చేరుకుంటాయనే వివరాలు వస్తాయి. ప్రయాణీ కులు ఆ సమాచారం మీద దానిమీద క్లిక్ చేస్తే నేరుగా ఆర్టీసీ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. అందులో టికెట్ బుక్ చేసుకొని, ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ అధికారులు, గూగుల్ ప్రతినిధు లతో చర్చించి ప్రయోగాత్మకంగా విజయవాడ- హైదరాబాద్ మార్గంలో దీనిని అమలు చేశారు.
కొద్ది రోజులపాటు దీనిని పరిశీలించగా విజయవంతంగా బుకింగ్స్ జరిగాయి. దీంతో ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయమున్న ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ఏయే రూట్లలో అందుబాటు లో ఉన్నాయనే వివరాలను గూగుల్‌కు అందజేశారు. గూగుల్ ఆయా రూట్లలో బస్టాప్‌ల వారీగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వంటివన్నీ ఆడిట్ టెస్ట్ జరిపి, మూడు రోజుల కిందట ఆమోదం తెలిపింది.
కాగా, వారం అన్ని రూట్లలో గూగుల్ మ్యాప్స్ ద్వారా బస్ టికెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించను న్నారు. వాట్సప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఇందు కోసం 9552300009 నంబరుకు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. సీట్లు ఎంపిక చేసుకొని ఆన్‌లైన్, డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సప్ నంబరుకు టికెట్ వస్తుంది. దీంతో పాటుగా మరోవైపు నేరుగా బస్సుల్లేని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ(APSRTC) కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణించి గమ్యం చేరుకునే విధానం తీసుకువచ్చింది. ప్రయాణీకులకు సౌకర్య వంతంగా సేవలను అందించేందుకు కొత్తగా ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications