వైసీపీకి గుడ్ బై..! తేల్చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే మత్స్యలింగం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ మార్పులు మొదలయ్యాయి. దాదాపు ఆరు నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తాజాగా టీడీపీలో చేరారు. ఇక, అదే సమయంలో అసెంబ్లీకి గైర్హాజరు కారణంగా తమ పైన చర్యలు తీసుకునేందుకు సిద్దం అయితే అందరం కలిసి రాజీనామాలు చేద్దామని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాగా, వైసీపీ 11 మంది ఎమ్మెల్యేల్లో అరకు శాసన సభ్యుడు వైసీపీ వీడేందుకు సిద్దమనట్లు ప్రచారం సాగుతోంది. దీని పైన ఆయన స్పష్టత ఇచ్చారు.
వైసీపీ నుంచి ప్రస్తుతం అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ... మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు సభకు రాకపోతే వారి పైన వేటు వేయాలని కూటమి నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతో.. తమ పార్టీ ఎమ్మెల్యేల పైన చర్యలు సిద్దమైతే.. ఎంపీలతో సహా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు. తాము ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సభలో తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇటు వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీ లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేల్లోనూ పార్టీ మార్పు దిశగా సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ మారుతున్నట్లు ప్రచారం వేళ ఆయన రియాక్ట్ అయ్యారు తన కట్ట కాలే వరకూ జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించారు. అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా కానీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని అరకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ మార్పు కథనంపై మత్స్యలింగం తీవ్రస్థాయిలో స్పందించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైసీపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి జగన్ కారణమని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనకు సముచితమైన స్థానాన్ని జగన్ కట్టబెట్టారని పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన గౌరవాన్ని తాను నిలబెట్టుకుంటానని వివరించారు. తనపై కొంతమంది కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని.. అందులో నిజం లేదని మత్స్యలింగం తేల్చి చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications