కాబోయే సీఎం పవన్ కల్యాణే: వేణుస్వామి సంచలనం
నిత్యం వివాదాస్పద అంశాలపై తనకు తోచినట్లుగా చెబుతూ దాన్నే జాతకంగా ప్రచారం చేసే వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. నిత్యం ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లో వాళ్లు అడుగుతారో.. మరి ఈయనే చెబుతాడో తెలియదుకానీ ఏదో ఒక అంశం అంటే అది కచ్చితంగా సెలబ్రిటీలకు సంబంధించిన అంశంమీదే మాట్లాడతాడు. అలా మాట్లాడి.. మాట్లాడి ఈయన కూడా ఒక సెలబ్రిటీలా మారిపోయాడు. వేణుస్వామి ఏం చెబుతాడో అని చూసేవారు కూడా ఉన్నారు.
పవన్ అభిమానుల ట్రోలింగ్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, 2029 ఎన్నికల్లో కూడా జగన్ గెలుపొందుతారని, 17 సంవత్సరాలపాటు ఆయనకు తిరుగులేదని చెప్పారు. 2019లో వైఎస్ జగన్ ను కలిసిన వీడియో ఉంటే దాన్ని వైరల్ చేయించుకున్నాడు వేణుస్వామి. ఈయన మాటలతో వైసీపీ శ్రేణులు ఆనందంతో గంతులేశారని చెప్పొచ్చు. అలా చెప్పిన వేణుస్వామి తాజాగా మాట మార్చారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవడు.. పిఠాపురం నుంచి గెలవడు.. ఆయన జాతకంలో సీఎం అయ్యే యోగం లేదు.. రాజకీయాల్లో ఆయన మోసపోతారంటూ వేణుస్వామి చెప్పిన విషయం తెలిసిందే.

2 days lo bale marupu vachindi ra nilo 😂😂 pic.twitter.com/EnrYtNNxOF
— Sandhya Reddy YSCRP 🇺🇿 (@SandhyaSamayam) May 28, 2024
సీఎం అవ్వాలనే కోరిక ఉంది
దీనిపై జనసేన శ్రేణులతోపాటు పవన్ కల్యాణ్ అభిమానులు వేణుస్వామిని తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్ దెబ్బకు వేణుస్వామి తట్టుకోలేక మాట మార్చాడా? లేదంటే ఉన్న విషయమే చెప్పాడా? అనేది తేలాల్సి ఉంది. ఆయనేమన్నారంటే.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక తనకు కూడా ఉందని, పవన్ అంటే తనకు విపరీతమైన పిచ్చి అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించి రేపు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం మాట్లాడిందా? లేదంటే గతంలో మాట్లాడిందా? అనేదానిపై స్పష్టత లేదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది పాత వీడియో అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications