Kakinada GGH: ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన వైద్యులు..

కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు కొత్త ప్రయోగం చేశారు. ఓ మహిళకు సినిమా చూపిస్తూ శస్త్ర చికిత్స చేశారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ.అనంతలక్ష్మి (55)కి గత కొద్ది రోజులుగా ఆనారోగ్యానికి గురవుతున్నారు. తరుచూ ఆమెకు తల నొప్పి వస్తుంది. అలాగే శరీరంలో కుడి వైపు చేయి, కాలు పని చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ కూడా చేశారు.

అనంతలక్ష్మి మెదడు లో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి కణితిని దొలగించాలని నిర్ణయించారు. మంగళవారం ఆమెకు ఆమె అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదుర్స్ చూపిస్తూ ఆపరేషన్ చేశారు. అనంతలక్ష్మి ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ చూస్తూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమె సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. వైద్యులు తమ పని తాము పూర్తి చేశారు. విజయవంతంగా కణితిని తొలగించారు.

At Kakinada GGH doctors performed surgery while showing NTR Aadhur s movie

అనంతలక్ష్మి మెలకువలో ఉండగానే (అవేక్‌ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ సర్జరీని పూర్తి చేశారు. దీంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఆమ శస్త్రచికిత్స అనంతరం ఆమె లేచి కుర్చున్నారని వైద్యులు తెలిపారు. అలాగే టిఫిన్ కూడా చేసినట్లు వివరించారు. ఇలాంటి శస్త్ర చికిత్సను జీజీహెచ్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి.అనంత లక్ష్మిని మరో అయిదు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు.

ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయడం మొదటిసారి అని కాకినాడ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి తెలిపారు. న్యూరోసర్జరీ డిపార్ట్​మెంట్​ వైద్య నిపుణులు విజయవంతగా ఆపరేషన్ చేశారని పేర్కొన్నారు. గతంలో కూడా సంగీతం వినిపిస్తూ ఆపరేషన్ చేసిన ఘటనలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+