షారుక్ ఖాన్, దళపతి విజయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అట్లీ
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించని విధంగా రికార్డు బద్దలు కొడుతూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటున్న ది. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ కు చేరుకుని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు మంచి పేరు తీసుకువస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే 900 కోట్ల క్లబ్ కు చేరుకున్న షారుక్ ఖాన్ జవాన్ సినిమా త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నేడు దర్శకుడు అట్లీ బర్త్ డే సందర్భంగా ఆసక్తికర విషయాలను షేర్ చేసిన అట్లీ, షారుక్ ఖాన్, దళపతి విజయ్ లకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

షారుఖ్ ఖాన్ తనకు ఫోన్ చేసి సినిమా తీయాలని అడగడంతో తను సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశానని పేర్కొన్నారు. ఇక దాంతో ఈ విషయాన్ని వెంటనే దళపతి విజయ్ కు చెప్పానని, ఆయన కూడా నమ్మలేదని పేర్కొన్నారు. అట్లీ నువ్వు చెప్పింది నిజమేనా.. నువ్వు సీరియస్ గానే చెబుతున్నావా? షారుక్ ఖాన్ కు నీతో సినిమా చేయాలని ఉంది అని అడిగారా? అంటూ ప్రశ్నించారన్నారు.
అవునని చెప్పగానే జవాన్ సినిమా విషయంలో దళపతి విజయ్ ప్రాణం పెట్టి సినిమా తీయమని చెప్పారని అట్లీ చెప్పుకొచ్చారు. షారుక్ ఖాన్, విజయ్ కాంబినేషన్ లో తాను త్వరలో మరో చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు, ఆ సినిమా కోసం తాను సీరియస్ గా పని చేస్తున్నట్టు అట్లీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లీ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.వరుస హిట్ సినిమాలు కొడుతున్న అట్లీ ఇప్పడు జవాన్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. అట్లీ దర్శకత్వంలో సినిమా చెయ్యటం కోసం టాప్ హీరోలుం పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications