వైసీపీ నేతను చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మహిళతో వెళ్తుండగా బయటకు లాగి షాకింగ్ ఘటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖులు మహిళలతో అక్రమ సంబంధాల వ్యవహారం ఏపీలో రచ్చగా మారుతుంది. నిన్నటికి నిన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అనే మహిళను లైంగికంగా వేధించాడని రచ్చ కొనసాగుతున్న సమయంలో, తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నాయకుడు పైన ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

వైసీపీ నేతపై దాడి

ఈ దాడికి కూడా మహిళతో అక్రమ సంబంధమే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్ రెడ్డి పైన చిత్తూరు జిల్లాలో దాడి జరిగింది. ఈ దాడి తీవ్ర కలకలం రేపింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద ఆయన ఓ మహిళతో కారులో వెళుతుండగా మహిళ భర్త అడ్డగించి దాడికి పాల్పడ్డాడు.

attack on ysrcp leader in chittoor district with extra marital affair woman husband attck video viral

వాహనం ఆపి చెప్పుతో కొట్టిన మహిళ భర్త

హరి ప్రసాద్ రెడ్డి సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు అన్న అనుమానమే ఈ దాడికి కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం హరి ప్రసాద్ రెడ్డితో పాటు, మహిళ కారులో వెళుతున్న క్రమంలో వాహనాన్ని ఆపిన అతను ఆ మహిళను బయటకు లాగి కొట్టాడు. ఆ తర్వాత కాలికున్న చెప్పు తీసి హరి ప్రసాద్ రెడ్డి మీద దాడి చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

దాడి చేసిన వ్యక్తి ఆ మహిళ భర్త అని, తిరుపతి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ అని స్థానికులు చెబుతున్నారు. దాడి అనంతరం హరి ప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేసి, ఆ మహిళను తనతో పాటు తీసుకు వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోలీసులకు ఫిర్యాదు చేయని వైసీపీ నేత

ఈ దాడిపైన ఇప్పటివరకు హరి ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనించవలసిన అంశం. మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్టుగా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గాని, ఎవరు నోరెత్తి మాట్లాడటం గానీ చేయలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా వైసీపీని మాత్రం వీడియో పోస్ట్ చేసి మరీ టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+