శ్రీవారి భక్తులకు గమనిక... ఉచిత అన్నప్రసాద వితరణకు టోకెన్లు జారీ..
తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు గమనిక. ఉచిత అన్నప్రసాద వితరణ కోసం టోకెన్లను జారీని ప్రారంభిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటింంచారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉచిత అన్నప్రసాద వితరణ గత వారం నుండి ప్రారంభమైంది. ఈ ఉచిత అన్నప్రసాద వితరణ కోసం పీవోఎస్ యంత్రం ద్వారా టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం బుధవారం ప్రారంభించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం పక్కనే ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఉచిత అన్నప్రసాదం స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏసీఏవో బాలాజి, ఐటీ జిఎం ఎల్ఎం.సందీప్ ఇతరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఛైర్మన్, ఈవో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం లక్ష మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా ఉచిత భోజనాన్ని చేస్తున్నారన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమాం అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పిఏసిలు తదితర ప్రాంతాల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇటీవల ఒంటిమిట్టలో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన తన చిన్నతనంలో జరిగిన విషయాలను ఒకసారి నెమరువేసుకున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు..
తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఈ అన్నదాన కార్యక్రమం మరింత విస్తృత పరిచేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. ఉచిత అన్నప్రసాద వితరణకు ముందుగా టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా తిరుమల స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఆలయ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పర్వదినాన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications